శాసనమండలి వైస్ చైర్మెన్ శ్రీ బండ ప్రకాష్ గారిని కలిసిన పులిమామిడి రాజన్న ...
శాసనమండలి వైస్ చైర్మెన్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు dr. బండ ప్రకాష్ ముదిరాజ్ గారిని గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన *BRS పార్టీ రాష్ట్ర నాయకుడు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల ఆశ్యజ్యోతి పులిమామిడి రాజు ముదిరాజ్ గారు ఈ సందర్బంగా రాజన్న గారు చెప్తూ తెలంగాణ ప్రభుత్వం గౌరవ కెసిఆర్ గారు మా జాతి ముద్దుబిడ్డ అయినటువంటి ప్రకాష్ అన్నగారికి ఇంత మంచి స్థానం కల్పించి శాసనమండలి వైస్ చైర్మన్ గా నియమించినందుకు ధన్యవాదములు తెలిపారు.ఇంకా జీవితంలో బండ ప్రకాష్ అన్నగారు ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించాలని కోరుకుంటూ తెలంగాణా లో దాదాపు 60లక్షల జనాభా ముదిరాజ్ జాతికి కేవలం ఇద్దరి నాయకుల ప్రాతినిత్యం మాత్రమే ఉందని మీరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సారి ఎలాగైనా BRS పార్టీ నుండి మన జాతి నుండి ఎమ్మెల్యే గా నిలబడటానికి బరిలో ఉన్నటువంటి నాయకులకి టికెట్ లు ఇప్పించాలని కోరినట్లు వారు తెలిపారు ఇట్టి విషయం పై dr. బండ ప్రకాష్ గారు కుడా సానుకూలంగా స్పందించినట్టు పులిమామిడి రాజన్న గారు తెలిపారు. రాజన్న గారి తో పాటు పటాన్చెరు నియోజకవర్గ నాయకులు *నీలం మధు ముదిరాజ్ గారు, జిల్లా ఉపధ్యక్షులు గాడిఖానా విజయభాస్కర్ గారు, సంగారెడ్డి కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు సుధాకర్ గారు సంగారెడ్డి పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

1.
What's Your Reaction?






